ప్రస్తుత రాజకీయాలకు నేను సరిపోను – రాయపాటి
గుంటూరు: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి ప్రస్తుత రాజకీయల పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులో ఎంపీలాడ్స్ నిధుల సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సరిస్థితుల్లో నేటి రాజకీయాలకు తాను సరిపోనని వ్యాఖ్యానించారు. వేరే పార్టీలో చేరే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 2014లోగా ఏక్షణంలోనైనా ఎన్నికలు వచ్చే వాతావరణం కనిపిస్తోందని, తాము పూర్తికాలం పాలన సాగించేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈలోగా ఎంపీలాడ్స్ పూర్తిస్థాయిలో వినియోగించాల్సిందిగా అధికారులను కోరారు.