ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్ పాలనే కారణం: నారాయణ
తిరుపతి : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి వైఎస్ అవినీతి పాలనే మూలమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. మద్యం సిండికేట్లపై విజిలెన్స్ నివేదిక రాజకీయ పక్షపాతంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాజకీయ తిమింగలాల పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక అమలు కోసం డిసెంబరు 10న రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చేయనున్నట్లు తెలియజేశారు.



