Tuesday, 3 November 2026

ప్రాణం తీసిన సెల్ఫీ

 హైదరాబాద్‌: ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన జంషేద్‌ ఖాన్‌(22) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రైలు కదులుతున్న సమయంలో పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో రైలు కాస్త వేగంగా కదలడంతో అతనిపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి తండ్రి మహమ్మద్‌ పర్వేజ్‌కు విషయం చెప్పారు. అయితే తన కుమారుడు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొందని తండ్రి ఆరోపించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *