రేగోడ్, (జనం సాక్షి )ఏప్రిల్30 ; ప్రెండ్లి పోలీస్ తో ప్రజలకు మరింత దగ్గరవుతున్నా మని ప్రెండ్లి పోలీస్ పై మెదక్ లో శిక్షణ నిర్వహిస్తున్నట్లు మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం రేగోడ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి రికార్డులు క్రైమ్ రిపోర్టులను పరిశీలించారు. రేగోడ్ మండలంలోని మరుపల్లిలో రెండు నెలల క్రితం జరిగిన దొంగతనంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. మెదక్ జిల్లాలోనే రేగోడ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ తక్కువగా నమోదు అవుతుందని అన్నారు. స్థానిక ఎస్సై జానయ్య ప్రమోషన్ పై వెళుతున్నారని ఆయన సర్వీసులు బాగానే ఉందని అన్నారు. ఈయన వెంట సిఐ రవీందర్ రెడ్డి.ఎస్ఐ జానయ్య. తదితరులు ఉన్నారు.
ప్రెండ్లి పోలీస్ పై శిక్షణ





