Wednesday, 4 November 2026

ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఉప్పల్‌లో ఉరేసుకుని మృతి

హైదరాబాద్‌,జూన్‌7(జ‌నం సాక్షి): నగరంలోని ఉప్పల్‌లో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉప్పల్‌ మెట్రో సవిూపంలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి సాప్ట్‌వేర్‌ ఉద్యోగిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై వాసుదేవ రెడ్డి అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. అయితే మృతుడు విప్రో ఉద్యోగి యతీష్‌ గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు సమాచారం. బండ్లగూడకు చెందిన యతీష్‌ విప్రోలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ లేవుట్‌ వద్ద చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికిచేరుకున్నారు. ఘటన స్థలంలో సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలం కావడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు లెటర్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కొడుకు మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అందర్నీ కలచి వేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.