భార్యను హత్య చేసిన కిరాతక భర్త

గుంటూరు,జూన్‌7(జ‌నం సాక్షి):గుంటూరు జిల్లా చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కోటేశ్వరరావు అనే వ్యక్తి రోకలి బండతో భార్యను కొట్టి హత్య చేశాడు. వీరిద్దరికీ రెండో వివాహమే కావడంతో కొంతకాలంగా కలహాలు జరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య గురువారం వేకువజామున తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారి హత్యకు దారి తీసిందని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు కోటేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో రికార్డు అసిస్టెంటుగా పనిచేస్తున్నాడు. రాత్రి గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు.