హైదరాబాద్ : ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు హైకోర్టులో చుక్కెదురైంది. బోగస్ కాలేజీల ఏరివేతకోసం ప్రభుత్వం చేపట్టిన తనిఖీలపై యాజమాన్యాలు వేసిన పిటిషన్ పై ఇవాళ కోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల తనిఖీలకోసం పోలీసుల సహాయం తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ వాదనలపై హైకోర్టు ఏఖీభవిస్తూ ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల సహాయంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేయొచ్చని తెలిపింది.
పోలీసులతో తనిఖీలు చేయడంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ద్విసభ్య బెంచ్ కు అప్పీల్ చేసుకుంది. అడిషనల్ ఏజీ రామచందర్‌రావు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు ప్రతీ ప్రైవేటు విద్యాసంస్థపై సోదా నిర్వహించే నిర్వహించి బోగస్ కాలేజీలను గుర్తించే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లతో విజిలెన్స్ సోదాలు చేసుకోవడానికి అనుమతిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.





