ఫర్నీచర్ షాపులో అగ్నిప్రమాదం
మహబూబ్‌నగర్,ఫిబ్రవరి11(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్ పూర్తి కాలిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.