– సీపీ అంజనీకుమార్
హైదరాబాద్, జనవరి28(జనంసాక్షి) : జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఆపరేషన్ స్మైల్ నడుపుతున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. 17టీమ్ లతో ఆపరేషన్ స్మైల్ ఏర్పాటు చేశామని వివరించారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 325 మంది పిల్లలను సురక్షితంగా కాపాడటం జరిగిందన్నారు. వారిలో 272 మంది పిల్లలను వారివారి కుటుంబాల చెంతకు చేర్చామని చెప్పుకొచ్చారు. మరో 53మంది పిల్లలను రెస్క్యూ ¬మ్ లో చేర్పించామన్నారాయన. దర్పన్ యాప్ ద్వారా ఆపరేషన్ స్మైల్ మరింత సులువైందని సీపీ అంజనీ కుమార్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో పిల్లలతో పనిచేయించినందుకు 14కేసులు నమోదు చేసామని చెప్పారు. ఆపరేషన్ స్మైల్ టీమ్ ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో రూ. 6,75,365 జరిమానా విధించామన్నారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా ఏపీ, బీహార్, యూపీ, నేపాల్ నుంచి కూడా పిల్లలను రెస్క్యూ చేశామని హైదరాబాద్ సీపీ వివరించారు. పిల్లలందరి వయసు 18సంవత్సరాల లోపేనని అన్నారు. రెస్క్యూ ¬మ్ ఉన్న పిల్లలందరికీ పోలీస్ శాఖ తరపున బట్టలు, బుక్స్ ఇవ్వడం జరుగుతుందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు.
ఫలితాన్నిస్తున్న ఆపరేషన్ స్మైల్




