Tuesday, 3 November 2026

‘ఫేస్‌బుక్‌’లో తిడతావా..?

హైదరాబాద్‌: సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్‌’ స్నేహితులను పెంచుకోవడానికే కాదు ఆవేశకావేషాలకూ వేదికవుతోంది. ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఏకంగా ఓ యువకుడిపై దాడిచేశాడు మరో యువకుడు. చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇర్ఫాన్‌ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో తనపై అనుచిత వ్యాఖ్యాలు చేశాడని ఆరోపిస్తూ ఖలీద్‌ అనే మరో యువకుడు కత్తితో దాడిచేశాడు. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఇర్ఫాన్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *