ఫ్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలి.
అక్రమ విద్య వ్యాపారాన్ని అడ్డు కట్టా వేయాలని టిజివిపి బోథ్ నియోజకవర్గ కో-కన్వీనర్ సతీష్ అన్నారు.సోమవారం రోజున తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అక్రమ విద్య వ్యాపారం చేస్తున్న ప్రవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మండలంలోని ఆయా పాఠశాలల్లో అధిక పీజులు అడ్మిషన్ పీజులు యూనిపాంలు పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ ల దుకాణాలు తెరిచి బహిరంగానే అమ్ముతున్నారని,సదరు ఫ్రైవేటు పాఠశాలలపై తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కొ-కన్వీర్ యు సతీష్ తాటికొండ శివ గాజుల కార్తీక్ గోనుగొప్పల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.