ఫ్లాష్.. ఫ్లాష్.. చెన్నూరులో కాంగ్రెస్ కు షాక్
డాక్టర్ రాజ రమేష్ రాజీనామా
టికెట్ రానందుకు చెన్నూరులో కాంగ్రెస్ కు రాజీనామా
మంచిర్యాల : చెన్నూర్ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ రాజ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ, టిపిసిసికి తన రాజీనామా పత్రాన్ని పంపినట్లు తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత లేదని, కొత్తగా చేరిన వాళ్లకు పెద్దపీట వేయడంతో క్యాడర్ ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన రాజకీయ భవిష్యత్ పై అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.