Tuesday, 3 November 2026

బంగారం దుకాణాల్లో కొనసాగిన దాడులు

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నగరంలోని బంగారు దుకాణాల్లో తూనికలు, కొలతలశాఖ తనిఖీలు రెండో రోజూ కూడా కొనసాగాయి. ముగ్గురు డిప్యూటీ కంట్రోలర్లు, ఐదుగురు సహాయ కంట్రోలర్లతో కలిసి 9 బృందాలు అబిడ్స్‌లోని పలు బంగారు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. తూకాల్లో మోసాలు గుర్తించారు. ఈ

సందర్భంగా పలు దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా నిన్న గ్రేటర్‌ పరిధిలో తూనికలు కొలతలశాఖ అధికారులు సోదాలు నిర్వహించి నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపై 45 కేసులు నమోదు చేశారు.