ప్రజల్లో వాటిపై సానుకూల ధోరణి
కెసిఆర్‌పై అభిమానంతో భారీ మెజార్టీతో గెలుపు
ఇంటింటి ప్రచారంలో మంత్రి మహేందర్ రెడ్డి
వికారాబాద్,నవంబర్2(జనంసాక్షి): సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారుతున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు . వికారాబాద్ జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి పర్యటించారు. తాండూర్ నియోజకవర్గంలో మంత్రి ఇంటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని శాశ్వత పట్టాలు ఇప్పించే పరిష్కారం చేస్తానని హావిూ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
గొల్ల చెరువుల సుందరీకరణ, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం రూ. కోట్లు అందించామని చెప్పారు. తాండూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.100 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.జిల్లాలోని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. ఎక్కడికెళ్లిన గ్రామాల్లో యువకులు, మహిళలు సీఎం కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తూ మద్దతు పలుకుతున్నారన్నారు. ఎన్నో ఎన్నికలను చూశాను కానీ, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వస్తున్న స్పందన గతంలో రాలేదని, కేసీఆర్‌పై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీని అన్ని నియోజకవర్గాల్లోనూ ఊహించని మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేద ప్రజలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు దీవిస్తున్నారన్నారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీపై ఎక్కడెళ్లిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని హావిూనిచ్చినా ప్రజలు నమ్మలేరని, టీఆర్‌ఎస్ పార్టీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామంటే ప్రజలు నమ్మి గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అసత్య హావిూలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆసరా పింఛన్లను రూ.2016లకు, రూ.3016లకు పెంపుపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు రూ.3016ల నిరుద్యోగ భృతి, ఒంటరి మహిళలకు రూ.2016ల పింఛన్ పెంచుతామని హావిూ, ఇంటింటికి తాగునీరందించే మిషన్ భగీరథ కార్యక్రమంతో ప్రజలంతా టీఆర్‌ఎస్‌కు మద్దతు పలుకుతున్నారన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాకు కృష్ణా జలాలను తీసుకురావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. మైనార్టీలకు, వైశ్యులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో చేసిందని, వైశ్యులకు ప్రత్యేక ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయనున్నందని వెల్లడించారు.




