Wednesday, 4 November 2026

బంగారం లాంటి పిల్లల్ని కడతేర్చింది

66

 హైద‌రాబాద్ జ‌నంసాక్షి :

బంగారం లాంటి ఇద్దరు పిల్లల్ని మతిస్థిమితం లేని కన్నతల్లి కడతేర్చింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన నిర్మల అనే మహిళకు అక్షర (2), సహస్ర (7 నెలలు) అనే ఇద్దరు పిల్లలున్నారు. నిర్మలకు గత కొంతకాలంగా మతిస్థిమితం వుండటం లేదు. కుటుంబ సభ్యులతో ఎప్పుడూ చనిపోతానని చెబుతూ వుంటుంది. ఆమెకు కుటుంబ సభ్యులు వైద్యం చేయిస్తున్నారు. అయితే మంగళవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిర్మల తన ఇద్దరు పిల్లల్నీ ఇంట్లోని మంచి నీటి సంపులో వేసేసింది. తాను కూడా నీటి సంపులోకి దూకడానికి ప్రయత్నించబోయే సమయంలో కుటుంబ సభ్యులు అక్కడకి వచ్చారు. దాంతో ఏమీ ఎరగనట్టు సంపు మూత మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంట్లో పిల్లలు కనిపించకపోయేసరికి నిర్మలను నిలదీశారు. దాంతో ఆమె తన పిల్లల్ని సంపులో వేసేశానని చాలా మామూలు విషయంలాగా చెప్పింది. దాంతో అదిరిపడిన అందరూ సంపు మూత తెరిచి చూడగా అప్పటికే ఇద్దరు పిల్లలూ చనిపోయారు. నిర్మల గతంలో అనేకసార్లు చనిపోవాలని అనుకుంటున్నానని చెబుతూ వుండేది.. తాను చనిపోతే తన పిల్లల్ని ఎవరు చూస్తారని కూడా ప్రశ్నిస్తూ వుండేది. చివరికి ఇంత ఘాతుకానికి పాల్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *