బంగారు గని కూలి 10 మంది మృతి

 కోనార్కా(గనియా),నవంబర్‌ 8 (జనం సాక్షి) : గనియా దేశంలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది బంగారు గని కూలి 10 మంది చనిపోయారు. గనియా ఈశాన్య ప్రాంతంలోని కోనార్కీ సవిూపంలో ఉన్న బంగారు గని ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో ఉన్న 10 మంది సజీవ సమాధి అయ్యారని రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే గనిలో 10 మంది కంటే ఎక్కువగానే కార్మికులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హావిూ ఇచ్చింది.