Wednesday, 4 November 2026

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

విశాఖపట్నం,(జనంసాక్షి): రెండు రోజుల్లో వాయవ్య, పశ్చిమల మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దాంతో ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పలు చోట్ల ఓ మోస్తరుగా వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *