కృష్ణా: బంగాళాఖాతంలో తమిళనాడు మత్స్యకారుల బోటు బోల్తా పడింది. ఒకరు గల్లంతయ్యారు. మత్స్యకారులు మరో నలుగురిని కాపాడారు. బందరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళ మత్స్యకారులు.. ఆంధ్రా సరిహద్దులో వేటకు వచ్చారు.




