బంగ్లాదేశ్‌లో స్వల్ప భూకంపం
షిల్లాంగ్ : బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత4.3గా నమోదైంది. అసోం-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరింగంజ్ జిల్లాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.