– పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
– అప్రమత్తమై మంటలార్పిన పోలీసులు
– చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్, ఆగస్టు15(జనం సాక్షి) : నగరంలోని బంజారాహిల్స్‌లో కలకలం రేగింది. ఓయువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పక్కనే ఉన్న ఇసుకను పోసి మంటలార్పారు. తీవ్ర గాయాలు కావటంతో వెంటనే అక్కడి అతన్ని సవిూప ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముషిరాబాద్ చెందిన సతీష్ (28) అనే యువకుడికి బంజారాహిల్స్ దేవరకొండ బస్తీకి చెందిన ఓ యువతితో వివాహమైంది. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ యువతి తన పుట్టింటికి వెళ్లింది. మంగళవారం సతీష్ ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దీంతో ఆమె తండ్రి మనోజ్, సతీష్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఫిర్యాదు వెనక్కు తీసుకోవాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సతీష్.. తన మామ మనోజ్‌ను బ్లాక్‌మెయిల్ చేశాడు. అతను ఎంతకీ స్పందిచకపోవడంతో బుధవారం పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కు వచ్చిన సతీష్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు ఇసుక సాయంతో మంటలార్పి ప్రాణాలు రక్షించారు. ప్రస్తుతానికి ప్రాణపాయం తప్పిందని, తీవ్రంగా గాయాలైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కలకలం




