హైదరాబాద్,మే12(జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్రంలో బడా రైతులు పెద్దగా లేరని, వారికి చెక్కులు అందే సమస్యే లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. 90.2 శాతం రైతులు ఐదెకరాల లోపు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం హరీష్ విూడియాతో మాట్లాడారు. 25 ఎకరాల పైన ఉన్న రైతులు 0.11 శాతం మంది మాత్రమే ఉన్నారని వెల్లడించారు. రైతు బంధు పథక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు అర్థరహితమన్నారు. జూన్ 2 నుంచి ప్రతి రైతుకు రూ. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని హావిూ ఇచ్చారు. తెలంగాణ సర్కార్ నిర్ణయం, చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీతో అన్నదాతల జీవితాల్లో రైతుబంధు పథకం భరోసా నింపిందని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రత్యేకంగా అన్నదాత ఆరుగాలం కష్టపడి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించడం గొప్ప విషయమన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే తమ సవిూప బ్యాంకు ఖాతాలలో నగదు పొందవచ్చన్నారు. ఇందుకోసం ముందుగానే బ్యాంకులకు నిధులు ఆర్బీఐ సమకూర్చిందని ఇది తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలితమేనని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపడుచులు బిందెలు పట్టుకుని రోడ్లపైకి రాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ మరో
వినూత్నమైన పథకం మిషన్ భగీరథను త్వరలో ప్రారంభించి ప్రతి ఇంటికీ నల్లాతో తాగునీళ్లు సరాఫరా చేస్తామన్నారు.
బడా రైతులెవరూ లేరు..అంతా బడుగు రైతులే: హరీష్ రావు




