బడ్జెట్‌పై టిఆర్‌ఎస్ నేతల ప్రశంసలు
హైదరాబాద్,సెప్టెంబర్9 (జనం సాక్షి ) : తెలంగాణ ప్రభుత్వం బ్జడెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట
వేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. ఈ బడ్జెట్‌లో దార్శనికత ఉందన్నారు. కెసార్ స్వయంగా అన్నీఆలోచనచేసికేటాయంఇపులు చేశారని అన్నారు. సోమవారం బ్జడెట్ కేటాయింపుల అనంతరం మండలి విూడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ ప్రభుత్వం బ్జడెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ వివిధ పథకాలకు కేటాయింపులు తగ్గించలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు బ్జడెట్‌లో కేటాయింపులు బాగున్నాయని అన్నారు. కేంద్రం అరకొర నిధుల కారణంగా అనుకున్నపథకాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు వచ్చాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్జడెట్ ప్రజల బ్జడెటని, ప్రజారంజకంగా ఉందని టీఆర్‌ఎస్ నేత నోముల నర్సింహయ్య కొనియాడారు. సోమవారం బ్జడెట్ కేటాయింపుల అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన బ్జడెట్ అన్ని సంక్షేమ రంగాలకు ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పేదలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ బ్జడెట్ ఉందని పేర్కొన్నారు.
బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట




