తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని వ్యాఖ్య
కేంద్రం తీరుపై మండిపడ్డి మంత్రులు…అన్యాయం జరిగిందన్న మాణిక్యాలరావు
అనంతపురం/తిరుపతి/గుంటూరు,మార్చి2(జనంసాక్షి): బడ్జెట్ కేటాయింపులపై టిడిపి భగ్గుమంటోంది. ఇప్పటికే అసహనం వ్యక్తం చేసిన బాబు త్వరలో ఢిల్లీకి వెళ్లి తన నిరసనను వినిపించాలని చూస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రలు కూడా ఇప్పుడు కేంద్రం ముష్టి విదిల్చడంపై మండిపడుతున్నారు. ఇలా చేయడం తమను అవమానించడమేనని అన్నారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయడానికి సైతం వెనకాడబోమన్నారు. మొన్నటికి మొన్న అస్త్రాలు జమ్మిచెట్టుపై దాచామని ఎంపిలు ప్రకటించారు. బాబు ఊ.. అంటే రంగంలోకి దిగుతామని ఎంపి శిప్రసాద్ ప్రకటించారు. ఇప్పడు బాలకృష్ణ, మంత్రులు ఓ అడుగు ముందుకు వేశారు. కేవలం వందకోట్లు ముష్టిపడేసి పోలవరం కట్టుకోమంటే ఎలా అని హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం వంద కోట్లతో పూర్తవుతుందా అని ప్రశ్నించారు. ఇది ఏ మూలకు సరిపోతుందన్నారు. ఇదేనా కేటాయింపులు అని అన్నారు. తెలుగు వారిని ఇలా అవమానించడం వల్ల ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు.బిజెపి ఇచ్చిన హావిూలకు కట్టుబడి కేటాయింపులు ఇవ్వాలన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాస్టం ముందుకు పోవాలంటే అరకొర నిధులు కేటాయిస్తే ఎలా అని అన్నారు. ప్రత్యేక ¬దాపై వేరే రాష్టాల్రకు లేని ఇబ్బంది ఏపీకి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే జనం తిరగబడతారని, ఇప్పటికైనా కేంద్రం స్పందించి ఆంధప్రదేశ్‌కు న్యాయం చేయాలని బాలకృష్ణ అన్నారు. అనంతలో బాలకృష్ణ బిజెపిపై తీవ్రంగానే స్పందించారు. జనం తిరగబడగారని ఆయన హెచ్చరించారు.తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే జనం తిరగబడతారని, ఇప్పటికైనా కేంద్రం న్యాయం చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ముష్టి వంద కోట్లు వేస్తారా అని ఆయన మండిపడ్డారు. ఎపికి ప్రత్యేక ¬దా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇతరరాష్టాల్రకు లేని ఇబ్బంది ఎపికి వచ్చిందా అని ఆయన అన్నారు. త్వరలోనే టిడిపి బృందం ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తుందన్నారు. ఇచ్చిన హావిూల అమలుకు పట్టుబడతామని అన్నారు.బడ్జెట్లో ఆంధప్రదేశ్‌కు కేంద్రం మొండి చెయ్యి బాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం మొండి వైఖరి ఇలాగే కొనసాగితే బాగుండదని, నాయకులెవరినీ ప్రజలు రోడ్లపై తిరగనివ్వరని హెచ్చరించారు. రాష్ట్ర అవసరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేసినా అర్థం చేసుకోవడంలేదని మండిపడ్డారు. ఇక్కడి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో కేంద్రం గ్రహించే రోజు తప్పకుండా వస్తుందంటూ… ఏ ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారో తనకు అర్థం కావడంలేదన్నారు. ప్రజలు ఏ విశ్వాసంతో ఓట్లేశారో దాన్ని నిలబెట్టుకునేలా హావిూల్ని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. అనంత జిల్లాలోని గొల్లపల్లి రిజర్వాయర్ సందర్శన సందర్బంగా బాలయ్య విూడియాతో మాట్లాడారు. ఇదిలావుంటే తిరుపతిలో టిడిపి ధర్నాకు దిగింది. కేంద్రంలోని బిజెపి ఆధ్వర్యంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపి నేతలు ధర్నా చేయడం విశేషం.కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని తిరుపతి అలిపిరి వద్ద టీడీపీ నేతలు ఈ ధర్నా చేశారు. తిరుపతి నుంచి కొత్తగా ఎన్నికైన
ఎమ్మెల్యే సుగుణమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియ చేశారు. దీంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రధాని మోడీ ఆందప్రదేశ్ కు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. తిరుపతి వేదికగా మోడీ ఇచ్చిన హావిూలను అమలు చేయాలన్నారు. మొత్తం విూద టిడిపి నేతలకు బిజెపికి వ్యతిరేకంగా ధర్నా చేయడం విశేషం. ఇక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఏపీకి ఇచ్చిన హావిూలు అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటా తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం అతితక్కువ సమయంలో 30 వేల ఎకరాల భూమిని సేకరించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్టాన్రికి ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరానికి రూ. 100 కోట్లు కేటాయించడం చాలా బాద కలిగించిందన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దాపై బీజేపీ నేతలు మాట మార్చడం సరికాదన్నారు. ఎపికి కేటాయింపులపై వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారవు కూడా భగ్గుమన్నారు. ఇదేమి విదిలింపులని అన్నారు. ఇలా వెలితే లక్ష్యాన్ని చేరుకోగలమా అని అన్నారు. కేంద్రం తీరు బాధాకరంగా ఉందన్నారు. పోలవరం సహా ప్రత్యేక ¬దా, నిధుల కేటాయింపు, రాజధానికి ఆర్థక సాయం తదితర విషయాల్లో బిజెపి తీరు దారుణంగా ఉందని గుంటూరులో అన్నారు. దీనికి సప్లింమెంటరీ బడ్జెట్ పెట్టి ఎపికి కేటాయింపులు పెంచాలని అన్నారు. దీనిపై తాము కేంద్రంతో మాట్లాడి నిధుల కోసం పోరాడుతామని అన్నారు. బీజేపీ నేత, మంత్రి మాణిక్యాల రావు మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హావిూలను మోదీ నెరవేర్చుతారని నమ్మకాన్ని వెలిబుచ్చారు. రాష్టాన్రికి న్యాయం జరిగేలా రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తమకు పార్టీ ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. కేటాయింపుల తీరు తమను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇలా చేస్తారని తాము కూడా ఊహించలేదని పశ్చమలో మాట్లాడుతూ అన్నారు. ఇక్కడి ప్రజల అసంతృప్తిని కేంద్రం దృష్టికి తీసుకుని వెలతామని అన్నారు.




