Thursday, 5 November 2026

బన్నీ ఉత్సవంలో కొట్టుకున్న భక్తులు… 26 మందికి గాయాలు

హైదరాబాద్‌: పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ముగిసింది. బన్ని ఉత్సవంగా పిలిచే ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కర్రల సమరంలో 26 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. వారికి వెంటనే అక్కడే ప్రాథమిక చికిత్సలు అందించారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో హింస తగ్గింది. జిల్లా ఎస్పీ రవికృష్ణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా దసరా సందర్భంగా కర్రల సమరం నిర్వహిస్తారు. ఉత్సవ విగ్రహాల కోసం రెండు వర్గాలు కర్రలతో ¬రా¬రీగా తలపడతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *