హైదరాబాద్,జూన్26(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన హరితహారంలో తామూ పాల్గొని ముందుకు సాగుతామని నటి జీవిత ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో తమవంతు చేయూతను అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌తో సినీనటి జీవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హరితహారంలో భాగస్వామ్యం విషయమై చర్చించారు. ప్రియాంక వర్గీస్‌తో సమావేశం ముగిసిన అనంతరంజీవిత విూడియాతో మాట్లాడారు. తమ ట్రస్ట్ ద్వారా హరితహారంలో పాల్గొనే విషయంపై చర్చించామని తెలిపారు. జులై 1న తమ కూతురు శివాని జన్మదినం సందర్భంగా హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులమంతా హరితహారంలో భాగస్వాములం అవుతామని ఆమె స్పష్టం చేశారు. హరితహారం కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామని జీవిత పేర్కొన్నారు.
హరితహారంలో మేమూ పాల్గొంటాం: సినీనటి జీవిత




