బస్సుల ఫిట్‌నెస్ పూర్తి చేసుకోవాలి
నిజామాబాద్,జూన్8(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున్ణప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పాఠశాల యాజమాని తప్పనిసరిగా తన వంతు బాధ్యతగా పాఠశాల బస్సులకుఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలని రవాణా అధికారులు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ముందుగానే బస్సలును సరిచూసుకోవాలని అన్నారు. తగిన అనుభవం ఉన్న డ్రైవర్లనే ఎంచుకోవాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కొన్ని పాఠశాలల బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేయించుకున్నాయని, మిగిలిన వారు సైతం త్వరగా ఈ పరీక్షలు పూర్తిచేసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పాఠశాల బస్సులను జప్తు చేస్తామని చెప్పారు. పాఠశాల యాజమాన్యాలు ఈ విషయంలో నిర్లక్ష్యం చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు.