బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన, ఈవిటీజింగ్ పాల్పడిన కఠిన చర్యలు

ఎస్సై శేఖర్ రెడ్డి

వీణవంక నవంబర్ 05 (జనంసాక్షి):- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన మహిళలు విద్యార్థులకు అసౌకర్యం కలిగించిన కఠిన చర్యలు తప్పవని వీణవంక ఎస్ఐ శేఖర్ రెడ్డి హెచ్చరించారు వారు మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న రోడ్లపై కానీ, గ్రామంలోని ప్రధాని కూడాలో కానీ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమన్నారు. పాఠశాలలకు కళాశాలలకు వచ్చిపోయే విద్యార్థినులకు, మహిళలను హేళనగా మాట్లాడడం తగదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు భంగం కలిగిస్తున్న వారిపై కఠినమైన శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తు కనిపిస్తే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి ఎస్ఐ కోరారు.