Tuesday, 3 November 2026

బహ్రయిన్‌ లో ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

హైదరాబాద్‌, జూన్‌2(జ‌నం సాక్షి) : తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు బహరేన్‌ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్‌ఎస్‌ సెల్‌ బహరేన్‌ శాఖ తరుపున రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అమరవీరులకు ఘన నివాళులర్పించి.. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రెసిడెంట్‌ రాధారపు సతీశ్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బొలిశెట్టి వెంకటేశ్‌ లు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరి సహకారాం వల్లే స్వరాష్ట్రం కళ సాకారమైందన్నారు. తెలంగాణ గల్ఫ్‌ ప్రవాసులకూ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆదుకోవడానికి రూ. 50 కోట్ల నిధులతో ఎన్నారై సెల్‌ ను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ లో 60ఏళ్ల పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకబాటుకు గురైందన్నారు. అనేక ఆశలు, ఆశయాలతో, అమరుల త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అదే కృషి, పట్టుదల, సంకల్పంతో బంగారు తెలంగాణ తీర్చిదిద్దేందుకు ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో గల్ఫ్‌ వలసలు కూడా కొంత తగ్గే ఆవకాముందన్నారు. నేడు రైతన్నలు అందరు కేసీఆర్‌ వంక చూస్తున్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్నిరంగాలను అభివృద్ధి చేస్తూ జనరంజక పాలనా కొనసాగిస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా, అటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న ఒకే ఒక్క సీఎం కేసీఆర్‌ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ సెక్రెటరీలు లింబాద్రి, డాక్టర్‌ రవి, సెక్రెటరీలు రాజేందర్‌, రవిపటేల్‌, గంగాధర్‌, జాయంట్‌ సెక్రెటరీలు విజయ్‌, దేవన్న, రాజేందర్‌ రావు, ఎగ్సిక్యుటివ్‌ మెంబర్స్‌ ప్రమోద్‌, సాయన్న, సురేష్‌ తో పాటు తదితరులు పాల్గొన్నారు.