బాణసంచా లైసెన్సులు తప్పనిసరిజిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18:  దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా(టపాసుల) దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు తప్పనిసరి అని, లైసెన్సులు సంబంధిత రెవెన్యూ డివిజన్‌ అధికారులు మంజూరు చేస్తారని జిల్లా రెవెన్యూ అధికారి సుధాకర్‌రావు అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశంలో బాణసంచా దుకాణాల ఏర్పాటు లైసెన్సుల జారీపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసుల దుకాణాల వద్ద ఆయిల్‌, దీపాలు, క్యాండిల్స్‌ నిషేధముని, విద్యుత్‌ వైరింగ్‌లు ఉండకూడదని అన్నారు. దుకాణాల సముదాయం 24గంటలు ఫైర్‌ ఇంజన్‌ అందుబాటులో ఉంచాలని అన్నారు. బ్రాండెడ్‌ టపాసులు మాత్రమే అమ్మాలని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు టపాసులు అమ్మరాదని అన్నారు. దుకాణాల యజమానులు ఫైర్‌ బకెట్స్‌ఇసుకతో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లైసెన్సులో సూచించిన దాని కన్నా ఎక్కువ స్టాకు ఉంచుకోరాదని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ ఇ.ఇ రవీందర్‌ రాజు, జిల్లా పౌరసంబంధాల అధికారి పి. శ్రీనివాస్‌, పోలీస్‌ సిఐ జె.సంజీవరావు, తహాశిల్దార్‌ భుజంగరావు, డాలర్లు, జగిత్యాల ఫైర్‌ వర్క్స్‌ డీలర్‌ ఎన్‌.రాజు, కాకతీయ ఫైర్‌ వర్క్స్‌, తదితరులు పాల్గొన్నారు.