బాధలో ఉన్న మాకు శుభాకాంక్షలా?

మోడీకి లోకేశ్‌ రీ ట్వీట్‌

అమరావతి,జూన్‌4(జ‌నం సాక్షి ): జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేసిన ప్రధాని స్పందనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతి స్పందించారు. విభజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే.. రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా? అని మంత్రి లోకేశ్‌ ప్రశ్నించారు. కేంద్రం ¬దాతో సహా విభజన హావిూలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను సంతృప్తి పరచాలని విూరు అనుకుంటున్నారా? అని అన్నారు. ప్రజల ఆవేదన ఎలా ఉందో విూరు అర్థం చేసుకోవాలని అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నానని, ప్రత్యేక ¬దా ఆంధ్రుల హక్కు అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

————