బాధితులకు న్యాయం చేస్తాం: ఎం.పి గల్లా
గుంటూరు,జూన్7(జనం సాక్షి): పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో అమాయకులపై కేసు నమోదు చేయవద్దని అధికారులను కోరినట్లు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. ముస్లింలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారు. బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో తల్లిదండ్రులు, బంధువులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారగా.. పోలీసులు కొందరి యువకులపై కేసు నమోదు చేశారు.బాలికపై యువకుడు యవకుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు పాత గుంటూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పాటు రాళ్ల దాడికి దిగారు. అంతేకాకుండా పోలీస్ వహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 22 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు.