బాధితులో.. నేరస్థులో ఇప్పుడే చెప్పలేం
– డ్రగ్స్‌కేసులో చట్టబద్ధంగా వ్యవహరిస్తాం
– అకున్ సబర్వాల్
హైదరాబాద్,ఆగష్టు 18(జనంసాక్షి):డ్రగ్స్ కేసు విచారణ చురుగ్గా కొనసాగుతుందని.. డిసెంబర్ చివరి నాటికి కోర్టులో ఛార్జీషీట్లు దాఖలు చేస్తామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సామాజిక బాధ్యతతో డ్రగ్స్ దుష్పరిమాణాలను చెబుతున్నామని చెప్పారు. డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు విద్యాసంస్థలు స్పందిస్తున్నాయని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు.నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, న్యాయనిపుణులతో చర్చించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. సిట్ ఇప్పటి వరకు 11 కేసుల్లో 22 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. సినీ ప్రముఖులు సాక్షులా? నిందితులా? అనేది ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. సినీ ప్రముఖుల విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామన్న అకున్.. సిట్ దర్యాప్తునకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోందని వెల్లడించారు. సాక్షుల విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురు చేస్తున్నట్టు చెప్పారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని, సిట్ చేస్తోన్న దర్యాప్తునకు ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోందని అన్నారు. పాఠశాలల్లో గురువులు విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని సూచించారు. ఇప్పటివరకు విద్యార్థులు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు. సామాజిక బాధ్యతతోనే డ్రగ్స్ దుష్పరిణామాలను ప్రజలకు వివరిస్తున్నామని, డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు విద్యా సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయని అన్నారు.