Wednesday, 4 November 2026

బాబా ఆలయాల్లో భక్తుల సందడి

విజయవాడ,జూలై27(జ‌నం సాక్షి): శుక్రవారం గురుపౌర్ణమి కావడంతో నగరంలోని సాయిబాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సాయిబాబా ఆలయాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సాయిబాబా ఆశీస్సుల కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా సాయిబాబా దేవాలయాల అధికారులు భద్రతా చర్యలు పాటిస్తున్నారు. ఆలయాల్లో అభిషేకాలు,హరతులు నిర్వహించారు. ఉదయం నుంచే బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజల కోసం భక్తులు బారులు తీరారు.

—-