Friday, 6 November 2026

బాబుతో అనిల్‌ అంబానీ భేటీ

అమరావతి,మే14(జ‌నం సాక్షి):  ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సచివాలయంలో భేటీ అయ్యారు. నెల్లూరు జిల్లాలో పవర్‌ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటు తదితర అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. అంతకుముందు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.