విలేకరుల ఆందోళన

కడప,మే14(జ‌నం సాక్షి):  కడప జిల్లా రైల్వే కోడూరులో సోమవారం ప్రింట్‌, ఎలక్టాన్రిక్‌ విూడియా విలేకరులు తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు మాట్లాడుతూ.. రోజు రోజుకూ విలేకరులపై దాడులు పెరిగిపోతున్నాయని దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని మైదుకూరు ఆంధప్రభ విలేఖరి సుబ్బారావుపై ఎస్‌ఐ దాడి చేయడం అమానుషమని ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారు మోహనక కృష్ణకు వినతి పత్రాలు అందజేశారు

తాజావార్తలు