Friday, 6 November 2026

బాబుతో ఇండోనేషియా మంత్రి భేటీ

 

అమరావతి,నవంబర్‌14(జ‌నంసాక్షి): సీఎం చంద్రబాబును ఇండోనేషియా మంత్రి సోఫియాం కలిశారు. ఏపీలో అమలు చేస్తున్న ‘పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం’పై చర్చించారు. ఏపీ నుంచి నైపుణ్య సలహాలను తీసుకుంటామని సోఫియాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి ప్రకృతి వ్యవసాయంపై రైతులతో మాట్లాడి వివరాలు సేకరించామని, ప్రకృతి వ్యవసాయంపై ఏపీ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని, ఈ ఏడాది 6 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు.