హైదరాబాద్ జనంసాక్షి : ఏపీ ముఖ్యమంత్రి ఫోన్‌కు ఎట్టకేలకు తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు. సుమారు అరగంట నుంచీ అందుబాటులోకి రాకుండా ఉన్న కేసీఆర్ చివరకు చంద్రబాబుతో మాట్లాడారు. రేపు ఉదయం పది గంటలకు గ వర్నర్ సమక్షంలో సాగర్ జలవివాదం గురించి మాట్లాడుకుని పరిష్కరించుకుందామన్న బాబు ప్రతిపాదనను కేసీఆర్ అంగీకరించారు. అప్పటి వరకూ ఇరు రాష్ర్టాల పోలీసులు, అధికారులు ఎవరి భూబాగంలో వారు ఉండి సంయమనం పాటించాలని వారు సూచించారు.




