బాబు ప్రభుత్వంలో అంతులేని అవినీతి

– సీఎం రైతులను మోసం చేస్తున్నారు.
– రైతుల తరుపున సీపీఐ ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తాం
– ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
నెల్లూరు, జులై7(జ‌నం సాక్షి) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. శనివారం నెల్లూరులో విూడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. ఏ పంట పండించినా రైతులు హ్యాపీగా లేరని… రైతు సమస్యలపై సీపీఐ తరపున పోరాడేందుకు ఈ నెల 10వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అంతులేని అవినీతి జరుగుతోందని… సీజేఎఫ్‌ భూములను అర్హులైన పేదలకు పారదర్శకంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు గడిచినా… రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధర ప్రకటించ లేదని, మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు ఇక చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. దేశంలో, రాష్ట్రంలో రైతుల అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటిచర్యలు తీసుకోవటం లేదని, కేవలం నామమాత్రపు కంటితుడుపు చర్యలతోనే కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆదోళనలకు సిద్ధమవుతుందని ప్రభుత్వాల మెడలు వంచి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.