బాబు బండారం బట్టబయలు
అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రా బాబు
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు
– స్టీఫన్సన్ సంభాషణ విడుదల
హైదరాబాద్:జూన్ 07(జనంసాక్షి):
ఆంధ్రబాబు అడ్డంగా దొరికిపోయాడు.ఓటుకు నోటు వ్యవహరంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని తాను తప్పకుండా నెరవేరు స్తానని స్టీఫెన్సన్ కు చంద్రబాబు ఇచ్చిన హావిూలు తీవ్ర సంచలనం సృష్టిస్తు న్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు చంద్రబాబుకు ఏ క్షణంలోనూనా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది.
స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది..
చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు విూతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి
ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ
స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. విూకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేవిూ లేదు
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:అన్నింటికీ విూకు నేను అండగా ఉంటా.. వాళ్లు విూతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:విూరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్సన్:ఒకే సార్
చంద్రబాబు:అది మా హావిూ.. మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్..
చంద్రబాబు:థాంక్యూ