బాల కార్మిక వ్యవస్థ కు రూపుమాపాలి
మల్దకల్ నవంబర్ 9 (జనంసాక్షి)మండల పరిధిలోని బిజ్వారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం మహిళభివృద్ధి,శిశు సంక్షేమశాఖఆధ్యర్యంలో సర్పంచు లక్ష్మన్న అధ్యక్షతన బాలల పరిరక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు.జిల్లా బాలల పరిరక్షణ విభాగం ప్రకాష్ మాట్లాడుతూ బాలల పై ఏ విధమైన వేదింపులు, అకృత్యాలు,హింస జరగకుండా చూడటంతో పాటు పిల్లలంతా ఆనందంగా ఉండేలా మార్చడం,బాల్య వివాహాలను అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన కై కృషి చేయడం కూడా ఈ కమిటీ యొక్క బాధ్యత,బాలలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజేష్,అంగన్వాడి టీచర్లు పార్వతమ్మ, వరలక్ష్మి,లక్ష్మమ్మ, అనంతమ్మ, ఆశా కార్యకర్తలు కాంతమ్మ, జ్యోతి,జగదీశ్వరి, భారతి,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.