Friday, 6 November 2026

బాల దినోత్సవంలో గ్రంధాలయ వారోత్సవాలు

విజయనగరం,నవంబర్‌14(జ‌నంసాక్షి): విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం బాలల దినోత్సవం సందర్భంగా 51 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 మంది స్కూల్‌ పిల్లలతో కలిసి స్థానిక ఎంఎల్‌ఎ విూసాల గీత, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రసాదుల రామకృష్ణలు కోట దగ్గర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఇఒ నాగమణి, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్‌ బోద్దుల నరసింగరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కనకాల మురళీ, గ్రంథాలయ సెక్రటరీ సూర్యనారాయణ మూర్తి, జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘ నాయకులు రామభద్రరాజులు ర్యాలీ కోట నుంచి గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయం వరకు కొనసాగారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు. అనంతరం సరస్వతీ దేవి, గురజాడ విగ్రహాలను పూలమాలలతో ఆలంకరించారు.