బావి మోటార్ లకు సంబంధించిన కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కారించాలి : కాసాల

నాంపల్లి జూన్ 21(జనం సాక్షి )నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజు పల్లి, చల్లవాణి కుంట‌, టి.పీ గౌరారం గ్రామాల్లో గత పదిరోజులుగా వ్యవసాయ బోర్ మోటారు లకు సంబంధించి కరెంట్ సమస్య నెలకొందని, దింతో రైతులు ఇబ్బందులు పడుతున్న దృష్యా సంబందిత అధికారులు ఇట్టి కరెంట్ సమస్యకు పరిష్కారం చూపాలని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి కోరారు. మంగళవారం మల్లపురాజు పల్లి గ్రామంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏదేని గ్రామల్లో కరెంటు సమస్య తలెత్తితే సంబందిత సిబ్బంది తూతూమంత్రంగా తాత్కాలిక మరమ్మత్తులు చెపట్టి చేతులు దులుపుకోకుండా పకడ్బందీ చర్యలు చెపట్టి ప్రజలకు ఎటువంటి కరెంట్ కష్టాలు లేకుండా చూడాలనిన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బొంత వెంకట‌య్య, బిజెవైయం నాయకుడు నాంపల్లి సతీష్, గ్రామ రైతులు చిలివేరు జంగయ్య, శ్రీరామ్ బిక్షమయ్య, వంగాల మోహన్ రెడ్డి, వరికుప్పల సహదేవ్, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, పంగ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.