బిఎస్పీ హత్నూర మండలాద్యక్షుడిగా ముక్కగల్ల ప్రవీణ్

హత్నూర (జనం సాక్షి)
బహుజన సమాజ్ పార్టీ హత్నూర మండలాద్యక్షుడిగా వడ్డెపల్లి గ్రామానికి చెందిన ముక్కగల్ల ప్రవీణ్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు ఆ పార్టీ మెదక్ జిల్లా ఇంఛార్జి అల్లారం రత్నయ్య తెలిపారు.మండలం పరిధిలోని దౌల్తాబాద్ గ్రామంలో శుక్రవారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ మేరకు వారికి నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి బిఎస్పీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్య నర్సింలు,నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి శాంతి కుమార్, మండల ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్,శివశంకర్,రవి,తరుణ్,మహేష్,రాములు, అనిల్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.