బికినీ భామల నడుమ ఫెల్ఫ్స్‌ సయ్యాట

రిటైర్మెంట్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్న స్విమ్మర్‌
లాస్‌ వెగాస్‌ ,సెప్టెంబర్‌ 5 : అమెరికన్‌ స్టార్‌ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ఫ్స్‌ ఏది చేసినా ప్రత్యేకమే… ఇటీవల లండన్‌ ఒలింపిక్స్‌తో తన కెరీర్‌ ముగించిన ఫెల్ఫ్స్‌ రిటైర్మెంట్‌ సంబరాలను కూడా స్విమ్మింగ్‌పూల్‌లోనే జరుపుకున్నాడు. అది కూడా కొంతమంది బికినీ భామల మధ్య రొమాంటిక్‌గా ముగించాడు. ఈ బికినీ పార్టీకి లాస్‌వెగాస్‌ వేదికగా నిలిచింది. లండన్‌ ఒలింపిక్స్‌ సక్సెస్‌ను పురస్కరించుకుని ముందుగా కేక్‌ కట్‌ చేసిన ఈ స్విమ్మింగ్‌ స్టార్‌ తర్వాత అందమైన బికినీ భామలతో జలకాలాడుతూ ఫుల్లుగా ఎంజాయ్‌ చేశాడు. ఈ పూల్‌ పార్టీకి అతని సహచరుడు అలిసన్‌ షమిడిట్‌ కూడా హాజరయ్యాడు. 27 ఏళ్ళ ఫెల్ఫ్స్‌ లండన్‌ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు గెలుచుకున్న అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. దీంతో 48 ఏళ్ళుగా సోవియట్‌ యూనియన్‌ జిమ్నాస్ట్‌ లారిసా లాతియానా పేరిట ఉన్న రికార్డులు అతను బద్దల కొట్టాడు. లండన్‌ గేమ్స్‌కు ముందే తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ స్విమ్మింగ్‌ షార్క్‌ ప్రస్తుతం రిలాక్స్‌ అవుతున్నాడు. వీకెండ్‌లో పోకర్‌ గేమ్‌తో ఎంజాయ్‌ చేస్తోన్న ఫెల్ఫ్స్‌ దానిలో లక్ష డాలర్లు గెలుచుకున్నట్టు తెలుస్తోంది.