బిజెపికి ముందస్తు ఎందుకో : టిడిపి
అనంతపురం,జూలై13(జనం సాక్షి): భాజపా రోజురోజుకు ఆదరణ కోల్పోతుందని, దీంతోనే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మెజార్టీ ఉన్నా ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారో, భాజపా నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుతున్నారన్నారు. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలోని 25 సీట్లు తెదేపా గెలుస్తుందన్నారు. లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. అన్న క్యాంటీన్లకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందన్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారికి కూడా అన్నక్యాంటీన్ ఉపయోపడుతుందన్నారు.