బిజెపికి షాక్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపికి రాజీనామా

హైదరాబాద్‌: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ నెల 27న రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. కాంగ్రెస్‌ తరపున మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.”రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కేసీఆర్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలి. నా ఆశయం ఐదు వారాల్లో నెరవేరుతుందని భావిస్తున్నాను. భారాసకు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. ప్రజల ఆలోచన మేరకు వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార భారాసకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదిగి.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడింది. ఇప్పుడు ప్రజలు భారాసకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు.