బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ త్వరగా కోలుకోవాలి – భాజపా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, జూన్ 02( జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ వీలయినంత త్వరగా కోలుకోవాలని ఆ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం శేరిలింగంపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో యోగానంద్ మాట్లాడుతూ బుధవారం నారాయణఖేడ్ ప్రాంతానికి వెళ్లి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో జ్ఞానేంద్ర ప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయని, వైద్య చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆయన ఆరోగ్యం మెరుగుదలకు కుటుంబ సభ్యులతోపాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని రకాలుగా కోరుకుంటున్నారని అన్నారు. భారతీయ జనతాపార్టీని శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి చేయడానికి జ్ఞానేంద్ర ప్రసాద్ విశేష కృషి చేయడం జరిగిందని, వీలైనంత త్వరగా ఆస్పత్రినుంచి పూర్తి ఆరోగ్యంతో బయటకువచ్చి జనజీవన స్రవంతిలో కలిసి పోవడంతోపాటు పార్టీ కార్యక్రమాలలో మరింత ఉత్సాహంగా పాల్గొనాలని గజ్జల యోగానంద్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గోవర్ధన్ గౌడ్ కార్యకర్తలు  పాల్గొన్నారు.