బిజెపి హోదా ద్రోహంపైనే ప్రచారం: రఘువీరా

అమరావతి,ఆగస్టు9(జ‌నం సాక్షి ): రాష్ట్రానికి ప్రత్యేక ¬దా, విభజన చట్టంలోని హావిూలు అమలు చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ చేసిన ద్రోహమే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అజెండాగా ఉంటుందని పిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి చెప్పారు. ఇదే ప్రధాన అజెండగా తన సారథ్యంలోని పీసీసీ టీమ్‌తోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చిచెప్పారు. కొత్తగా ఎవరినైనా కమిటీలో చేర్చుకోవడం మినహా.. ఎలాంటి మార్పులూ ఉండవన్నారు. ఈ నెల 18న గానీ, 19న గానీ రాహుల్‌గాంధీ కర్నూలు వస్తారని తెలిపారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేరికతో కాంగ్రెస్‌ బలం పెరిగిందని, మున్ముందు మరింత మంది ముఖ్య నేతలు పార్టీలో చేరతారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలతో తప్ప రాష్ట్రంలోని ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తేలేదని పునరుద్ఘాటించారు. ప్రతి ఇంటి నుంచీ రూపాయి చొప్పున తీసుకుని.. పార్టీ బలోపేతంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తామన్నారు.

 

తాజావార్తలు