Monday, 2 November 2026

బిల్లుల ఆమోదంలో మాది సరికొత్త రికార్డ్‌- కేంద్రమంత్రి వెంకయ్య

6

హైదరాబాద్‌, డిసెంబర్‌, 21 (జనంసాక్షి) :లోక్‌సభలో రికార్డు సంఖ్యలో బిల్లులు ఆమోదించామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. లోక్‌సభలో ఒకే సెషన్‌లో 17 బిల్లులు ఆమోదం పొందగా, రాజ్యసభలో 11 బిల్లులు మాత్రమే ఆమోదం పోందాయన్నారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. ఏపీలోని అమరావతి, తెలంగాణలోని వరంగల్‌ను వారసత్వ నగరాలుగా గుర్తించామని, పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెంకయ్యనాయుడు తెలిపారు. వారసత్వ సంపద పరిరక్షణకు నిన్న సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ప్రాచీన కట్టడాలు, పురాతన సంస్కృతిని కాపాడుకోవాలని కోరారు. పేదలకు గృహనిర్మాణ పథకం కింద రూ.101 కోట్లతో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *