బిసిలకు వైసిపి చేసిందేమిటి: యనమల

అమరావతి,జూన్‌11(జ‌నం సాక్షి): బీసీలతో వైసీపీ ఆత్మీయ సమావేశం విడ్డూరంగా ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ బీసీలకు వైసీపీ గతంలో చేసింది లేదు…భవిష్యత్‌లో చేసేది ఉండదని వ్యాఖ్యానించారు. వైఎస్‌ హయాంలో బీసీ సంక్షేమానికి నిధులు ఇవ్వలేదన్నారు. తాము నాలుగేళ్ల హయాంలో బీసీలకు రూ.36వేల కోట్లు ఖర్చుచేశామని, టీడీపీ విధానాల వల్ల బీసీలలో ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు. బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న వైసీపీ కుట్రలు ఫలించవని మంత్రి చెప్పారు. మోదీ, అమిత్‌షాపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏపీలో వైసీపీ, జనసేనతో బీజేపీ రహస్య ఒప్పందం కుదర్చుకుందని మంత్రి యనమల ఆరోపించారు.